మహిళల కోటాపై BJP–Congress మధ్య మళ్లీ ఫైట్?

మహిళలకు 33% రిజర్వేషన్‌పై అసలు గొడవ ఇవ్వాలా వద్దా అనే దానిపై కాదు.. ఎప్పటి నుంచి అమలు చేయాలన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రభుత్వం డీలిమిటేషన్‌తో దీనిని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా, కాంగ్రెస్ మాత్రం మహిళల కోటాను ఆలస్యం చేయకుండా త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీంతో BJP–Congress మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. ఈ రిజర్వేషన్ అమలైతే లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. అందుకే ఇది కేవలం రాజకీయ ఫైట్ కాదు.. మహిళల ప్రాతినిధ్యం ఎప్పుడన్న ప్రశ్న కూడా.



