ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆయన డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు అనేక రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం జేపీ నద్దా ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్డియాలజీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రివర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.



