విద్యార్థుల భద్రతకు భంగం కలిగిస్తే సహించం: AIPSU

TG: విద్యార్థుల భద్రత, విద్యా భవిష్యత్తుకు భంగం కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు నిర్వహిస్తే సహించేది లేదని AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ‘విన్స్ పాఠశాల’ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నిబంధనలు పాటించకుండా పాఠశాలను నిర్వహించడం వల్ల విద్యార్థుల విద్యా భవిష్యత్తుతో పాటు వారి భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.


