విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి : సహకరిస్తామన్న స్టాలిన్

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము సహకరిస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రాకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పారు. విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో డీఎంకే, ఏఐడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలకు స్టాలిన్ తెరదించారు. ఏఐఏడీఎంకే బీజేపీ కలిసి విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము పడగొట్టాలని అనుకోమని, అయితే ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు.



