మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబసభ్యులపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్‌లో హత్యాయత్నం, గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆయన పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదులో జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్ సహా 11 మంది పేర్లను చేర్చారు. ఏడాదిగా కుటుంబసభ్యులంతా తనను గదిలో బంధించి కొడుతున్నారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో తెలిపారు.



