ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

TG: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో చేపట్టిన ఆందోళనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2వ పీఆర్సీని ప్రకటించాలని కోరారు.


