← Back to news

అత్యంత పౌష్టికాహారంగా కాక్రోచ్ మిల్క్

By Mahesh· 25 Jul 2026
అత్యంత పౌష్టికాహారంగా కాక్రోచ్ మిల్క్

కాక్రోచ్(బొద్దింక) మిల్క్ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత పౌష్టికాహారంగా మారే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు. 2016లో బెంగళూరులోని రీజనరేటివ్ మెడిసిన్ శాస్త్రవేత్తల రీసెర్చ్‌లో వీటిలో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు ఉన్నట్లు గుర్తించారు. శరీర కణాల పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు ఇందులో ఉన్నాయని వెల్లడించారు. ఈ పాలు మనుషుల వినియోగానికి అందుబాటులో లేవు. అయితే భవిష్యత్తులో సూపర్ ఫుడ్‌గా ఉపయోగపడే అవకాశాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు.

More in Science

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤
Science· 21 Aug 2026

నిద్రలో ఒక్కసారిగా కింద పడుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది? 💤

నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఒక్కసారిగా కింద పడుతున్నట్టు అనిపించి ఉలిక్కిపడటం చాలామందికి జరుగుతుంది. దీనిని ‘హిప్నిక్ జర్క్’ అంటారు. నిద్రలోకి మారే సమయంలో కండరాలు ఒక్కసారిగా జర్క్ అవడం వల్ల ఈ అనుభూతి వస్తుంది. మనం నిజంగా పడిపోతున్నామని కాదు.. మెదడు, శరీరం మేల్కొనే స్థితి నుంచి నిద్రలోకి మారుతున్న సమయంలో వచ్చే సహజ స్పందన ఇది. ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ కెఫీన్ వంటివి దీన్ని మరింత పెంచొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే. మీకు కూడా ఇలా జరిగిందా? కామెంట్‌లో చెప్పండి. 👇