ఒక్క ప్రశ్న.. కోర్టులో దోషిగా తేల్చింది

బట్టలు ఇస్త్రీ చేసే ఓ వ్యక్తి వేసిన ప్రశ్న అతణ్ని కోర్టులో దోషిగా నిలబెట్టింది. 2021లో ఢిల్లీకి చెందిన ప్రియాంక గుప్తా తన మూడేళ్ల కూతుర్ని భర్త దగ్గరికి తీసుకెళ్తూ ‘నాన్న వచ్చేశాడు. ఇంక ఏడవొద్దు’ అని చెప్పింది. అక్కడే ఉన్న గిర్ధారీ లాల్ “కౌన్ సే వాలే పాపా?(ఏ తండ్రి?)” అని అడిగాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనన్న మాటకు “నీ బిడ్డకు ఎక్కువమంది తండ్రులున్నారా?” అని అవమానకర అర్థం వస్తుందని భావించిన కోర్టు అతణ్ని దోషిగా తేల్చింది.



