రాజస్థాన్ లో CJP టీమ్ అడ్డగింత
రాజస్థాన్‌లోని బాగ్రూ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ పరిస్థితి చూడటానికి వెళ్లిన Cockroach Janata Party (CJP) టీమ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. School Thik Karo క్యాంపెయిన్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన CJP కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకా, ఇతర కార్యకర్తలను వెనక్కి పంపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసి “టెర్రరిస్టులు, నక్సలైట్లు” అంటూ అన్నారని CJP కార్యకర్త శివాంగి శర్మ చెప్పారు. “ఔట్‌సైడర్, ఇన్‌సైడర్ అని ఎందుకు? ఇది ఒక్క దేశం.. మన దేశంలోని పిల్లల గురించే మాట్లాడుతున్నాం” అని ఆమె అన్నారు.



