PF కట్ పెరుగుతుందా? జీతంపై ఎఫెక్ట్ ఇదే!

EPFO వేతన పరిమితిని కేంద్రం నెలకు 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయలకు పెంచింది. సెప్టెంబర్ 17, 2026 నుంచి కొత్త పరిమితి అమల్లోకి వచ్చింది. దీంతో 15,000 రూపాయల నుంచి 25,000 రూపాయల జీతం ఉన్న మరింత మంది ఉద్యోగులు తప్పనిసరిగా EPFO పరిధిలోకి వస్తారు. 25,000 రూపాయల పరిమితిపై 12 శాతం లెక్కన ఉద్యోగి PF వాటా గరిష్ఠంగా 3,000 రూపాయలు అవుతుంది. అంటే పాత 1,800 రూపాయలతో పోలిస్తే చేతికి వచ్చే జీతం 1,200 రూపాయల వరకు తగ్గొచ్చు. అయితే PF పొదుపు, EPS పెన్షన్ వాటా కూడా పెరుగుతుంది.


