నీటి కోసం నిత్యం పోరాటం
AP: గుక్కెడు నీటి కోసం ప్రతిరోజూ దూరం వెళ్లాల్సిన దుస్థితి.. తాండవలస గిరిజనులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలోని చిడిమెట్టు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సరిపడా నీటి సౌకర్యం లేకపోవడంతో దూరంగా ఉన్న నీటి ఊటల నుంచి ప్రతిరోజూ నీటిని మోసుకురావాల్సి వస్తోందని తెలిపారు. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.



