గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

TG: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని 67 పుష్కర ఘాట్లను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖల ద్వారా సుమారు రూ.1,000 కోట్లతో ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.



