ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ రెస్పాన్స్

ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వ్యవస్థలో సైబర్ సెక్యూరిటీ సమస్యలున్నాయన్న ఆరోపణలపై సీబీఎస్‌ఈ రెస్పాండ్ అయ్యింది. ఓఎస్‌ఎంలో బయటపడ్డ లోపాలపై దృష్టిపెట్టామని ఎక్స్‌లో చెప్పింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు బృందం ఓఎస్‌ఎం వ్యవస్థ భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కొన్ని రోజులుగా ట్రై చేస్తోందని తెలిపింది. ఇప్పటికే బయటపడ్డ లోపాలను పరిష్కరించామని తెలిపింది. ఇతరత్రా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.



