పేదరికాన్ని జయించి స్పేస్ మిషన్‌లో చోటు

AP: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందింది. సైన్స్‌పై ఆసక్తితో పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో పలు వినూత్న ప్రాజెక్టులు రూపొందించిన ఆమె, 'శక్తిశాట్-ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్' కోసం జరిగిన ఎంపికల్లో 108 దేశాల నుంచి నమోదైన 12 వేల మందిలో భారత్ తరఫున ఎంపికైన 21 మందిలో చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థినిగా ఆమె నిలిచింది.



