← Back to news

వీఆర్‌ఏల ఆందోళనకు CITU సంపూర్ణ మద్దతు

By DK· 2d ago
వీఆర్‌ఏల ఆందోళనకు CITU సంపూర్ణ మద్దతు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి CITU సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్‌ఏలు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న తమ సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం తగదన్నారు. వీఆర్‌ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు అర్హులకు ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

More in Local