యూత్‌లో క్యాన్సర్ పెరగడానికి మెయిన్ రీజన్ ఇదేనా?!

యువతలో క్యాన్సర్ కేసులు పెరగడానికి బయలాజికల్ ఏజ్ పెరగడమే ప్రధాన కారణమని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ తెలిపింది. పాత తరంతో పోలిస్తే ఇప్పటి జనరేషన్ యూత్‌లో బయలాజికల్ ఏజ్ ఫాస్ట్‌గా పెరుగుతోందని సైంటిస్టులు గుర్తించారు. ఈ బయలాజికల్ ఏజింగ్ వల్ల లంగ్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్, గర్భాశయ, కొలొరెక్టల్ వంటి ఎర్లీ ఆన్‌సెట్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందంట. పుట్టిన ఏళ్లను బట్టి కాకుండా బాడీ హెల్త్ కండిషన్‌ను బట్టి ఈ ఏజ్ డిసైడ్ అవుతుంది.


