నోట్లో గోల్డ్ Capsules.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో షాక్!
బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో CISF సిబ్బంది 82 గ్రా. గోల్డ్‌ను సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు రెండు గోల్డ్ క్యాప్సూల్స్‌ను నోట్లో దాచుకుని, ఘజియాబాద్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సెక్యూరిటీ చెకింగ్‌లో అతడిపై అనుమానం రావడంతో CISF అధికారులు ఫ్రిస్కింగ్ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో గోల్డ్‌ను సీజ్ చేసి, ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.



