మంచిర్యాలలో జోరుగా భూముల రీసర్వే

మంచిర్యాల జిల్లాలోని ఎంపిక చేయబడిన గ్రామాలలో భూముల రీసర్వే జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి, ఆయేపెల్లి గ్రామాలలో రీసర్వే జరుగుతున్న తీరును మండల తహసీల్దార్ రాఘవేంద్రతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీసర్వే పనుల పురోగతి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా కొనసాగుతుందని, రీసర్వే ప్రక్రియకు రైతులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.



