← Back to news

ఫ్లైట్‌లో పైలెట్ల ఫైట్

By Krishna· 18h ago· X

దుబాయి నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయి ఫ్లైట్‌లో పైలట్ల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఒకరు, మరొకరిని కత్తితో పొడవడంతో హైజాక్ సిగ్నల్స్ వెళ్లాయి. ప్లేన్‌ని సౌదీ అరేబియాలోని తబూక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సుమారు 180 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులున్న ఈ బోయింగ్ 737లో.. కాక్‌పిట్‌లో రక్తం కారుతుండగా ప్రయాణికులు, సిబ్బంది కలిసి.. దాడి చేసిన పైలట్‌ను అణచివేశారు. ప్లేన్ ఎత్తు నుంచి ఒక్కసారిగా పడి.. 7700, 7500 కోడ్‌లు వెళ్లడంతో ఇజ్రాయెల్ ఫైటర్‌జెట్లు సిద్ధమయ్యాయి. మొత్తంగా అందరూ సేఫ్‌గా ఉన్నారు.

More in International