← Back to news

తోటవలసకు తాగునీటి ట్యాంక్.. టీడీపీ వినతి!

By B V Appalanaidu· 2h ago· Ananthagiri, Ananthagiri, Alluri Sitharama Raju
తోటవలసకు తాగునీటి ట్యాంక్.. టీడీపీ వినతి!

అల్లూరి సీతారామరాజు జిల్లా కొత్తూరు పంచాయతీలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దుంబరి కృష్ణ పలు సమస్యలపై ఎంపీడీవో ప్రభాకరావుకు వినతిపత్రం అందించారు. తోటవలసలో తాగునీటి ట్యాంక్ నిర్మించాలని, టెంకబుడ్డి, బుసుపాడు గ్రామాలకు రోడ్డు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. అర్హులకు ఆర్‌ఎఫ్‌ఓ పట్టాలు, నూతన రేషన్‌కార్డుదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

More in Local