స్టూడెంట్స్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన విజయ్
తమిళనాడులోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ విస్తరణను సీఎం విజయ్ ఇవాళ ఉదయం ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో విజయ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, స్టూడెంట్స్‌కు బ్రేక్‌ఫాస్ట్ వడ్డించారు. తర్వాత వారితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. కొత్తగా 15,454 పాఠశాలల్లోని 15.30 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం అదనంగా 217.63 కోట్లు కేటాయించడంతో మొత్తం బడ్జెట్ 724 కోట్ల రూపాయలకు చేరింది.


