← Back to news

ఉప్పు అనుకుని డిటర్జెంట్ వేశారు… 36 మంది పిల్లలు అస్వస్థత

By Nani· 19 Aug 2026· Ndtv
ఉప్పు అనుకుని డిటర్జెంట్ వేశారు… 36 మంది పిల్లలు అస్వస్థత

స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలకు ఒక్కసారిగా వాంతులు, తల తిరగడం మొదలయ్యాయి. బిహార్‌లోని నలందా జిల్లాలోని పరాసి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 36 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో ఉప్పు తక్కువగా ఉందని కొందరు చెప్పడంతో, వంటమనిషి ఉప్పు అనుకుని డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు స్థానికులు చెబుతున్నారు. వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ డబ్బాలు ఒకే చోట ఉండటమే ఈ పొరపాటుకు కారణమై ఉండొచ్చని సమాచారం. పిల్లలను ఆసుపత్రికి తరలించగా, అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.