ఆన్‌లైన్‌లో నో స్టాక్.. రోడ్డుపై రైతుల రాస్తారోకో!

యూరియా కోసం ఆన్‌లైన్ బుకింగ్ – కానీ ప్రతీసారీ 'నో స్టాక్'. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఓ వైపు 440 బస్తాలు తాడ్వాయి పీఎసీఎస్ పరిధిలో ఉన్నాయని, కావాల్సిన రైతులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతుంటే, మరోవైపు రైతులు యాప్ ఓపెన్ చేస్తే.. మళ్లీ 'నో స్టాక్' అని వచ్చింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డెక్కారు. సమస్యను పై స్థాయి అధికారులకు తెలియచేస్తానని AO హామీనివ్వడంతో శాంతించారు.



