MLC ఓటు నమోదుపై అవగాహన సదస్సు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్ MLC ఎన్నికల ఓటు నమోదుపై BRS ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ MLA నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో రాజశ్రీ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు, పలువురు గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు. MLC ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన గ్రాడ్యుయేట్స్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు.


