సిలిండర్ పేలి ముగ్గురు మృతి

TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో షార్ట్ సర్క్యూట్‌తో సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందారు. కలాల్‌వాడలో ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో చంద్రమ్మ(50), మనవడు లక్ష్మణ్(17), మనవరాలు ప్రణతి(14) సజీవ దహనమయ్యారు. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మూడు డెడ్‌బాడీలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమ్మిత్తం గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పిల్లల తండ్రి హైదరాబాదులో, తల్లి పూణెలో కూలీ పనులు చేస్తుంటారు. అమ్మమ్మ దగ్గర ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు.



