← Back to news

అరకులోయలో టీచర్స్ డే వేడుకలు

By B V Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
అరకులోయలో టీచర్స్ డే వేడుకలు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సి.హెచ్. కేశవరావు, అధ్యాపకులు, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గురువుల సేవలు అమూల్యమైనవని, విద్యార్థులు వారి ఆదర్శాలను పాటించి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రిన్సిపల్ సూచించారు. అనంతరం విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, NSS వాలంటీర్లు పాల్గొన్నారు.

More in Local