← Back to news

విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి

By VISHI· 8 Jun 2026· Andhrajyothy
విశ్రాంత ఆర్చ్‌బిషప్ డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మృతి

AP: విశాఖపట్నం విశ్రాంత ఆర్చ్‌బిషప్ మోస్ట్ రెవ. డాక్టర్ ప్రకాశ్ మల్లవరపు మరణించారు. ఆయన మృతిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాశ్ మల్లవరపు తుదిశ్వాస విడవడం బాధాకరమని పేర్కొన్నారు. విద్యావంతుడిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన తన జీవితాన్ని క్రైస్తవ సమాజ సేవకు అంకితం చేశారన్నారు. జయవాడ బిషప్‌గా, కడప బిషప్‌గా, ఏలూరు డయాసిస్ అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఆర్చ్‌బిషప్‌గా, శ్రీకాకుళం అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన సేవలందించారన్నారు.

More in AP