సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా మృతి

CNN-న్యూస్18 సీనియర్ జర్నలిస్టు పాయల్ మెహతా(46) ఆకస్మికంగా కన్నుమూశారు. ముంబయి పర్యటనలో ఉన్న ఆమె ఆదివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. పాయల్ మృతిపై ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.


