← Back to news

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు

By Anusha· 1h ago
నెస్లే ఇండియాపై FSSAI చర్యలు

చిన్న పిల్లల ఆహార ప్రాడక్స్‌పై రూల్స్ అతిక్రమించిందని నెస్లే ఇండియాపై FSSAI చట్టపరమైన చర్యలు చేపట్టింది. నాన్‌ ఎక్సెల్లా ప్రో స్టేజ్‌ 1, లాక్టోజన్‌ ప్రో 1 తదితర ఉత్పత్తులపై ఈ-కామర్స్‌ వేదికల్లో ప్రచారాలను గుర్తించినట్లు తెలిపింది. పిల్లల ఆహార విక్రయాలను పెంచే ప్రకటనలు నిషేధమని స్పష్టం చేసింది. నెస్లే ఫార్ములాలో బయోటిన్‌ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తించి మూడు కేసులు నమోదు చేసింది. దీంతో నెస్లే షేరు 2 శాతం నష్టపోయింది.

More in National

ఇస్లామిక్‌ గ్రీటింగ్‌.. IPS అధికారిణి బదిలీపై వివాదం!
National· 31m ago

ఇస్లామిక్‌ గ్రీటింగ్‌.. IPS అధికారిణి బదిలీపై వివాదం!

వెస్ట్‌ బెంగాల్‌ IPS అధికారిణి బుష్రా బానో ట్రాన్స్‌ఫర్‌పై వివాదం నెలకొంది. UPSC సివిల్స్‌ ప్రిపరేషన్‌పై స్టూడెంట్స్‌కి అవగాహన కల్పిస్తూ ఆమె ‘X’లో ఓ <a href="https://x.com/HinduLegalFund/status/2099093555142955193">వీడియో పోస్ట్‌ చేశారు.</a> అందులో ‘అస్సలాముఅలైకుమ్‌’, ‘ఇన్‌షా అల్లాహ్‌’, ‘జజాకల్లాహ్‌’ వంటి ఇస్లామిక్‌ గ్రీటింగ్స్‌ యూజ్‌ చేశారు. దీనిపై హిందూ లీగల్‌ ఫండ్‌ కంప్లైంట్‌ చేసిన నెక్స్ట్‌ డేనే బానోను ఖరగ్‌పూర్‌ ASP పోస్టు నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ప్రభుత్వం మాత్రం ఇది రొటీన్‌ ట్రాన్స్‌ఫర్‌ అని చెబుతోంది. ఈ ఇష్యూపై రాజకీయంగా చర్చ మొదలైంది.