CJP నిరసనకు మద్దతుగా ఆదిత్య ఠాక్రే పిలుపు

ముంబైలోని శివాజీ పార్కులో CJP నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు ఇవ్వాలని శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే పిలుపునిచ్చారు. “ముంబై ప్రజలు ప్రజాస్వామ్యాన్ని తిరిగి సాధించేందుకు వస్తున్నారు. అందరూ ఈ నిరసనకు మద్దతు ఇవ్వాలి. బీజేపీ నిరంకుశ పాలన మన ఓటును కాజేసింది. దాన్ని మనం సాధించాలి. ఇది రాజకీయం కాదు, దేశం గురించి. ఇది మన ప్రజాస్వామ్యం, మన ఓటు, మన రాజ్యాంగం గురించి. ద్రోహి జ్ఞానేష్ రాజీనామా చేయాలి” అంటూ ఆదిత్య ఠాక్రే తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
