98వ రోజుకి చేరిన రిలే దీక్ష

మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్‌నగర్ సర్వే నంబర్ 151లో స్థలాల కోసం బాధితులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 98వ రోజుకు చేరింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూత్, ఇతర సంఘాల నాయకులు కట్టమీద శ్రీను, కుమ్మరి విట్టల్, కరీం భాయ్, గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ దీక్ష నడుస్తోంది. ఇన్ని రోజులైనా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోవడంపై బాధితులు సీరియస్ అయ్యారు. తమ స్థలాలు ఇచ్చేదాకా పోరాటం ఆపేది లేదని, రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు.



