← Back to news

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో టెక్నికల్ సమస్య

By అనిల్ బాబు· 2d ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాంకేతిక లోపంతో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యను వెంటనే పరిష్కరించి రిజిస్ట్రేషన్ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

More in Local