← Back to news

ఆలయంలో బెల్ట్ షాపు వేలం.. స్థానికుల అభ్యంతరం

By Bala· 2d ago
ఆలయంలో బెల్ట్ షాపు వేలం.. స్థానికుల అభ్యంతరం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొండ్రపాడులో బెల్ట్ షాపు నిర్వహణ కోసం మంగళవారం వేలంపాట నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలోనే వేలం నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపు నిర్వహణకు పోటీ ఉండటంతో వేలం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణంలో వేలం నిర్వహించిన వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

More in Local