"న్యాయం చెయ్యండి లేదా మమ్మల్ని చంపేయండి"

మధ్యప్రదేశ్.. పన్నా జిల్లాలో కేన్-బెత్వా నదుల లింకింగ్, మఝ్‌గవాన్, రుంఝ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా ఇళ్లు మునిగిపోయిన వందల ఆదివాసీ కుటుంబాల వారు చితిపై పడుకొని ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ మహిళలు "న్యాయం చెయ్యండి లేదా చంపండి" అంటూ చేస్తున్న నిరసనలు.. అందర్నీ కదిలిస్తున్నాయి. ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని పెంచినట్లు చెప్పింది. కానీ సరైన పరిహారం, భూమి, పునరావాసం ఇవ్వలేదనీ, సర్వేలు సరిగా చెయ్యలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. బుందేల్‌ఖండ్ కరవు నివారణకు సంబంధించిన ప్రాజెక్టు ఇది.


