← Back to news

మహిళపై రేప్ అటెంప్ట్.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు

By Vishi· 4 Aug 2026· X· UP

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే వినోద్ సింగ్‌పై ఒక మహిళ లైంగికదాడి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తన గన్నర్ ధనంజయ్ యాదవ్ ద్వారా తనను పిలిపించాడని చెప్పారు. మద్యం తాగి, ప్రైవేట్ భాగాలను తాకి, బట్టలు చింపి రేప్ చేయడానికి ప్రయత్నించాడని ఆమె వివరించారు. తన 10 ఏళ్ల కుమార్తెపై యాసిడ్ అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. లక్నో హజ్రత్‌గంజ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా FIR నమోదు కాలేదని వివరించారు. మహిళా కమిషన్‌కు వెళ్లిన తర్వాత తనపైనే 420 కేసు పెట్టారని అన్నారు.

More in India