బెంగాల్ అసెంబ్లీ రద్దు- గవర్నర్ ప్రకటన

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆర్. ఎన్. రవి ఉత్తర్వులిచ్చారు. అసెంబ్లీ గడువు ఈ రాత్రితో ముగుస్తుండటం, మరోవైపు మమత రాజీనామా చేసేందుకు తిరస్కరించడంతో గవర్నర్ ఈ యాక్షన్ తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం అయిదేళ్ల గడువు పూర్తయ్యాక అసెంబ్లీ రద్దవుతుందని, కొత్త ప్రభుత్వం పవర్ లోకి వచ్చే వరకూ అధికారంలో ఉన్న మంత్రులు ఆపద్ధర్మ మంత్రులు అవుతారు. గవర్నర్ ఈరూల్స్ కోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.



