← Back to news

బస్సు రాకపోవడంతో గ్రామస్తుల కష్టాలు!

By Mohammed Hafeez· 21 Aug 2026· పెంచికలపాడు
బస్సు రాకపోవడంతో గ్రామస్తుల కష్టాలు!

TG : జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సు వచ్చేలా చూడాలని ఊరి జనం కోరుతున్నారు. ఈ సమస్యపై గతంలో గ్రామస్తులు మూడు రోజులు ధర్నా చేయగా, డిపో మేనేజర్ బస్సు నడుపుతామని మాట ఇచ్చారు. కానీ ఇప్పటివరకు రాత్రి బస్సు ఊర్లోకి రావడం లేదని ప్రజలు, యువకులు బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా PDS అధ్యక్షుడు హలీం పాషా మరోసారి డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు.

More in Local