← Back to news

కలెక్టరేట్ వద్ద ఎర్రబెల్లి ధర్నా.. ఉద్రిక్తత

By DK· 2h ago
కలెక్టరేట్ వద్ద ఎర్రబెల్లి ధర్నా.. ఉద్రిక్తత

TG: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లక్కీ డ్రాను వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. జనగామ కలెక్టరేట్ వద్ద ఆయన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరు పేదలకు ఇళ్లు కేటాయించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు తీసుకుని ఇళ్లను అమ్ముకున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. లక్కీ డ్రాను ఆపకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

More in Local