← Back to news

ముగిసిన గోదా రంగనాథ స్వామి పవిత్రోత్సవాలు

By Dosawada Adithya· 1h ago· Ranga Reddy
ముగిసిన గోదా రంగనాథ స్వామి పవిత్రోత్సవాలు

TG: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం రంగధాములలోని గోదా రంగనాథ స్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కూడా వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ప్రధాన అర్చకులు ఎస్.టి.ఎస్. కేశవ చార్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.

More in Local