← Back to news

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

By dk yamjala· 26 May 2026
ఘోర రోడ్డు ప్రమాదం..  ముగ్గురు స్పాట్‌డెడ్

AP: కారు అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు ట్రాన్స్‌ఫార్మర్‌ను బలంగా ఢీకొట్డడంతో ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in AP