వరద బాధిత రోడ్లకు ముమ్మర మరమ్మత్తులు!

ఎన్టీయార్ జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలంలో 2024 వరదలకు దెబ్బతిన్న రోడ్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత నెలలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పనులు ప్రారంభించారు. ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్లు ఇప్పుడు జాప్యం లేకుండా త్వరగా పూర్తవుతున్నాయి. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



