← Back to news

APలో కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్

By dk· 7 Aug 2026
APలో కొత్త పాలసీకి గ్రీన్ సిగ్నల్

APలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) ప్రాజెక్టులకు కొత్త విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో భారీ పెట్టుబడుల సమీకరణ, ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, సమర్థ పర్యవేక్షణ లక్ష్యంగా కొత్త పాలసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన PPP ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆర్థికంగా సాధ్యంకాని ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తోపాటు వడ్డీలేని రుణాలు అందించేందుకు ప్రత్యేక బ్రిడ్జ్‌ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

More in AP