ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు: APPSC

AP: రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు APPSC నోటిఫికేషన్లు జారీ చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై APPSC స్పందించింది. APPSC అధికారికంగా ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదని, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. APPSC ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధంగా షెడ్యూల్ ఏదీ జారీ చేయలేదని కమిషన్ తెలిపింది.



