ఉజ్జయినిలో 2,200 ఏళ్ల నాటి బౌద్ధ స్తూపం కోసం తవ్వకాలు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని వైశ్య టెక్రీ దగ్గర 2,200 సంవత్సరాల నాటి భారీ బౌద్ధ స్తూపం ఉండవచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రసిద్ధ సాంచీ స్తూపం కంటే చాలా పెద్దదని అంటున్నారు. ఈ రహస్యాన్ని వెలికితీయేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ (ASI) కలిసి తవ్వకాలకు ఏర్పాట్లు చేస్తున్నాయి. 1938-39లో బ్రిటిష్ పాలన టైంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. అప్పటి నివేదిక ప్రకారం ఈ స్తూపం వ్యాసం సుమారు 350 అడుగులు, ఎత్తు కనీసం 100 అడుగులు ఉండవచ్చని అంచనా.



