← Back to news

గురువులకు ఎమ్మెల్యే పాదాభివందనం

By Dosawada Adithya· 2h ago· Ranga Reddy
గురువులకు ఎమ్మెల్యే పాదాభివందనం

TG: తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తన గురువులు మదన్మోహన్ రెడ్డి, గోపాలచారిలను శాలువాతో సత్కరించి పాదాభివందనం చేశారు. అనంతరం మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందిన టీచర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గునూరు బస్వం తదితరులు పాల్గొన్నారు.

More in Local