← Back to news

సీఎం సభకు ముందే బుల్లెట్ ట్రైన్ ఉద్యమ నేత అరెస్ట్

By DK· 1h ago
సీఎం సభకు ముందే బుల్లెట్ ట్రైన్ ఉద్యమ నేత అరెస్ట్

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధన ఉద్యమ కన్వీనర్, ప్రొఫెసర్ జానకి రెడ్డిని సూర్యాపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఉదయం ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు స్టేషన్‌లో సంతకం చేయాలంటూ తీసుకెళ్లి అక్కడే నిర్బంధించారని అఖిలపక్ష పోరాట కమిటీ ఆరోపించింది. సీఎం సభకు ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని, నిరసనకు పిలుపునివ్వలేదని తెలిపింది. ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం అమానుషమని ఖండించింది.

More in Local