రాత్రివేళ డాక్టర్లు లేరు.. ఆసుపత్రిలో రోగుల అవస్థలు

కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో రాత్రి వేళల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండటంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో సిబ్బంది కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. సిబ్బందిని అడిగితే టీ తాగేందుకు వెళ్లామని చెబుతున్నారని, సమస్యను ప్రశ్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ వార్డులోనూ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదన్నారు.


