← Back to news

ఎమ్మెల్యే బాలకృష్ణకు మోకాలి సర్జరీ

By RK· 24 Jul 2026
ఎమ్మెల్యే బాలకృష్ణకు మోకాలి సర్జరీ

నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ‘NBK 111’ సినిమా షూట్‌లో గాయమైంది. తొడ కండరాన్ని మోకాలి చిప్పకు కలిపే కణజాలం చిట్లడంతోపాటు ఇరువైపులా గాయాలు అయినట్లు డాక్టర్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు మూడు గంటల పాటు ఆయన ఎడమ మోకాలికి సర్జరీ చేశారు. దెబ్బతిన్న భాగాలను బాగు చేసినట్లు ఆర్థోపెడిక్ సర్జన్ గౌతమ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపారు.

More in News