VROపై కత్తితో దాడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్

కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో VRO గోపాల్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బోయ తిరుమలేష్, బోయ దస్తగిరిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. VRO గోపాల్, నిందితుల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షల కారణంగానే దాడి జరిగినట్లు సి.బెళగల్ SI వేణుగోపాల్ రాజు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ సింగ్, కానిస్టేబుల్స్ కిషోర్, శ్రీరాములును SI అభినందించారు.


