టెస్టుల పేరుతో పసిపాపను అమ్మేసిన నర్సులు!

మెదక్ లైఫ్ కేర్ హాస్పిటల్‌లో ఒక దారుణమైన incident బయటపడింది. అక్కడ పుట్టిన ఒక Baby Girlను నర్సులు టెస్టుల పేరుతో తీసుకెళ్లారు. ఆ తర్వాత పాప చనిపోయిందని అబద్ధం చెప్పి, పేరెంట్స్‌ని నమ్మించారు. కానీ సీక్రెట్‌గా ఆ పాపను రూ.1.50 లక్షలకు వేరే వాళ్ళకి అమ్మేశారు. పేరెంట్స్‌కు Doubt వచ్చి పోలీసులకు చెప్తే అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. పోలీసులు ఇద్దరు నర్సులతో పాటు పాపను కొన్నవాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే ఆ హాస్పిటల్‌ను సీజ్ చేయించారు. ఈ హాస్పిటల్ లో గతంలో కూడా ఇలాంటి అక్రమాలు ఇంకేమైనా చేశారా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



